Header Banner

పాకిస్తాన్ తో పాటు మరో శత్రువుతోనూ ఆర్మీ యుద్ధం! ఏకకాలంలో దాడి!

  Sat May 10, 2025 15:38        India

పహల్గాం దాడి తర్వాత ఉగ్రమూకల్ని, వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముందు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం.. ఆ తర్వాత వారి క్షిపణి రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చింది. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ బేస్ లపైనే దాడి చేస్తోంది. ఇదే ఊపులో మరికొన్ని రోజుల్లోనే యుద్ధం ముగించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది.

 

అయితే పాకిస్తాన్ పై ఓవైపు తీవ్ర స్ధాయిలో యుద్దం చేస్తున్న భారత త్రివిధ దళాలకు ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అదే నకిలీ వార్తలు. ఓవైపు కదనరంగంలో కాలు దువ్వుతూనే మరోవైపు ఈ ఫేక్ న్యూస్ పైనా దాడి చేయాల్సిన పరిస్ధితి ఆర్మీకి ఎదురవుతోంది. ఎందుకంటే శత్రువులతో తాము చేస్తున్న పోరాటంలో ఎలాగో విజయం తమదేనని మన బలగాలకు తెలుసు. అదే దైర్యంతో ఇప్పుడు దూకుడుగా మందుకెళ్తున్నారు కూడా. అయితే ఈ ఫేక్ న్యూస్ విషయంలోనే ఇబ్బందులు తప్పడం లేదు.

 

ఇది కూడా చదవండి: వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం!

 

ముఖ్యంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ తో పాటు వారి సానుభూతిపరులు వ్యాప్తి చేస్తున్న ఫేక్ న్యూస్ ఇప్పుడు ఆర్మీని చికాకు పెడుతోంది. అలాగని దీన్ని లైట్ తీసుకుంటే మన ప్రజలే దీన్ని నిజమని భావించి ఆందోళన చెందే ప్రమాదం ఉంది. దీంతో ఆర్మీ ఎప్పటికప్పుడు ఈ ఫేక్ న్యూస్ ను ఖండించేలా కచ్చితమైన ఆధారాలతో ముందుకొస్తోంది. తాజాగా భారత నగరాలు, విమానాశ్రయాలు, పౌరులపై, జవాన్లపై పాకిస్తాన్ దాడులు అంటూ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలాగే పాకిస్తాన్ లో భారత బలగాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కూడా మరికొన్ని ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

 

మరోవైపు పాకిస్తాన్ కూడా తప్పుడు సమాచారాన్ని బహిరంగంగానే వెల్లడిస్తోంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు, అధికారులు , సైన్యం కూడా బారత్ పై దాడి చేసినట్లు ఫేక్ న్యూస్ లు తెరపైకి తెస్తున్నారు. తద్వారా తమ పౌరుల్లో తమపై నమ్మకం పోకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా చివరికి భారత్ కు చికాకుగా మారుతోంది. దీంతో తాజాగా రక్షణ, విదేశాంగశాఖలు పక్కా ఆధారాలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi War with Pakistan and another enemy too